ఉచిత కుట్టుమిషన్ శిక్షణ శిభిరం ప్రారంభం - నల్లజర్ల పార్డ్ ఇండియా మరియు జయం సొల్యూషన్ వారు సంయుక్తంగా నల్లజర్లలో కుట్టుమిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిని స్థానిక శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారిచే ప్రారంభించారు. ఎం.పి.డి.ఓ గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మయోజన గూర్చి తెలియజేసారు. నల్లజర్ల సిఐ గారు మాట్లాడుతూ పార్డ్ ఇండియా చేస్తున్న సేవలను కొనియాడారు. సర్పంచ్ పల్లి జ్యోతి గారు మాట్లాడుతూ పార్డ్ ఇండియా మహిళా సాధికారిత కొరకు పాటుపడుచున్నది చెప్పారు. నాభిపేట సర్పంచ్ సత్యలక్ష్మి మాట్లాడుతూ పార్డ్ ఇండియా సంస్థ గత 10 సంవత్సరాలు నుండి తెలుసునని చెప్పారు వీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పారు. RWS (AE) స్వచ్చంధ సంస్థ ద్వారానే పేదవారికి న్యాయము జరుగుతాదని చెప్పారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి పార్డ్ ఇండియా చేస్తున్న కృషిని కొనియాడారు.నాద్వారా ఏదైనా సహాయం కావలసి వస్తే ఎల్లవేళలా నేను సిద్ధంగా ఉంటానని చెప్పారు.
-
+3