నాగ మణికంఠ విచిత్ర ప్రవర్తన.. ఎలిమినేట్ అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసేలా ఉన్నాడు !!

బిగ్‌బాస్ కంటెస్టెంట్ల సెలక్షన్ ఎప్పుడూ దరిద్రంగానే ఉంటుంది.ఫస్ట్ మూడు, నాలుగు సీజన్ల వరకు బలమైన కంటెస్టెంట్లనే బిగ్‌బాస్ యాజమాన్యం సెలెక్ట్ చేసుకుంది కానీ ఆ తర్వాత ఎవరికీ తెలియని కంటెస్టెంట్లను తీసుకోవడం మొదలు పెట్టింది.

పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) లాంటి ఫేక్, మెంటల్ కంటెస్టెంట్లను కూడా తీసుకొచ్చి పెట్టింది.

ఈసారి అతనికంటే ఘోరంగా ఉన్నారు కంటెస్టెంట్లు.ముఖ్యంగా నాగమణికంఠ.

సీజన్ 8 సెప్టెంబర్ ఒకటో తేదీన స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.నాగమణికంఠ ( Nagamanikantha )రెండు మూడు రోజులు మంచిగానే ఉన్నాడు కానీ నిన్న మొన్న ఎపిసోడ్స్ నుంచి తను ఏదో తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే అతని బిహేవియర్ అలా ఉంది.సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు అవసరం లేకుండానే అతను ఒక మెంటల్ పేషెంట్ అని అర్థమవుతున్నట్లుగా బిగ్‌బాస్ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

సీజన్ 8 చూస్తుంటే భవిష్యత్తులో కంటెస్టెంట్‌ను ఎంపిక చేసేటప్పుడు ఫిజికల్ టెస్ట్‌లతో పాటు మెంటల్ టెస్టులు( Mental Tests ) కూడా పెట్టాల్సి రావచ్చేమో అని అనుమానం కలుగుతోంది.

మణికంఠ బిహేవియర్ అందరికీ బాగా ఆందోళన కలిగించింది.ఒక దశలో బిగ్‌బాస్ అతన్ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి కౌన్సెలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరమొచ్చింది.

ఇప్పటికిప్పుడు అతన్ని బయటికి పంపించేస్తే ఏదైనా సెల్ఫ్-హామ్‌ చేసుకుంటాడేమో అనే భయం కూడా పట్టుకుంది.

"""/" / అతను మెంటల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నాడనే సంగతి తెలియకుండా ప్రాంక్ ఎలిమినేషన్ చేశాడు బిగ్ బాస్.

దాంతో మణికంఠ చాలా భయపడిపోయాడు.అప్పటినుంచి సింపతీ కార్డు, విక్టిమ్ కార్డు వాడుతూ ప్రేక్షకుల ఓట్లు సంపాదించాలని చూస్తున్నాడు.

ఎవరు ఏమనకపోయినా తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తున్నాడు.ఒంటరిగా పడుకుని తన చిన్నప్పటి బాధలన్నీ తలుచుకుని బాగా ఏడుస్తున్నాడు.

ఫ్లాష్ బ్యాక్‌లు, తన సొంత కథలు అన్నీ మర్చిపోయి హౌస్ లో ఆట ఆడాలి కానీ ఇతను మాత్రం తనకు జీవితంలో ఎదురైనా విషాదాలను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు.

"""/" / ఒక గేమర్‌గా ఆడితేనే ఆటలో ఉండగలడు.లేకపోతే ఇంటికి వెళ్లి పోవాల్సిందే.

ప్రేక్షకులు కంటెస్టెంట్ల సైకలాజికల్, ఫిజికల్, ఇంటెక్చువల్, స్పాంటేనిటీల స్ట్రెంత్ చూసి ఓట్లు వేస్తారే తప్ప ఇలా ఏడుస్తూ తన ట్రాజడీలు చెప్పుకునే వారిని తొందరగా పంపించేస్తారు.

"నా తండ్రి చనిపోయాడు.తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

తర్వాత తల్లి చనిపోయింది.ఆమె అంత్యక్రియల కోసం బిచ్చం ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చింది.

నాకెవరూ లేరు సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నా.మెంటాలిటీ మార్చుకోవడానికే బిగ్ బాస్ కి వచ్చా.

ఇప్పుడు ఫస్ట్ వీకే నన్ను బయటికి పంపించేస్తే నాకు నెగిటివ్ ఇమేజ్ రాదా?"' అంటూ అతడు మాట్లాడిన తీరు అందర్నీ షాక్‌కి గురి చేసింది.

కన్ఫెషన్ రూమ్‌లో అతడు కూర్చున్న తీరు, తన బాడీ లాంగ్వేజీ అతని మెంటల్ కండిషన్ ఎంత అన్‌స్టేబుల్‌గా ఉందో చెప్పకనే చెప్పేసాయి.

ఫ్లాపైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారా?

  翻译: