మేము సేకరించే సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తామో ఈ విభాగం వివరిస్తుంది. ఇతర విషయాలతోపాటు, మేము వ్యక్తిగతీకరించిన ఉత్పత్తులు మరియు సేవలను వృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికై కష్టించి పనిచేసి మీకు అందించడానికి మేము సేకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఈ దిగువన, మేము సమాచారాన్ని ఉపయోగించే ప్రతి ఉద్దేశ్యం గుండా వెళుతూ విపులంగా వివరిస్తాము. మేము ఏ ప్రయోజనాల కోసం డేటా సేకరిస్తామో ఆ డేటా మ్యాపింగ్ ను మీరు చూడాలనుకుంటే, మేము ఇక్కడఒక పట్టిక కలిగి ఉన్నాము.
కీప్ థింగ్స్ అప్ మరియు రన్నింగ్ (అంటే, మా సేవలను ఆపరేట్ చేయడం, అందజేయడం మరియు నిర్వహించడం)
మా సేవలను ఆపరేట్ చేయడానికి, అందజేయడానికి మరియు నిర్వహించడానికి గాను, మేము సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు ఒక ఫ్రెండ్ కు పంపించాలని మీరు అనుకునే ఒక Snap అందజేయడం, మీరు స్నాప్ మ్యాప్‌లో మీ లొకేషన్‌ను షేర్ చేస్తే, మీ పరిసరాల్లో మీరు ఇష్టపడే స్థలాలు, ఇతరులు మ్యాప్‌లో పోస్ట్ చేసిన కంటెంట్ లేదా, ఒకవేళ మీ స్నేహితులు తమ స్థానాన్ని మీతో షేర్ చేస్తుంటే. మా ఉత్పత్తులను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడానికి సహాయపడేందుకు కూడా మేము మీ కొంత సమాచారాన్ని ఉపయోగిస్తాము, ఉదాహరణకు మా సేవలు అత్యంత తాజా ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు పరికరాలతో పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి.
మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించండి మరియు సందర్భం అందించండి
మేము Snapచాటర్లకు వ్యక్తిగతీకృతమైన సేవలను అందిస్తాము. మేము దీనిని చేసే మార్గాలలో ఒకటి, మీకు సముచితమైన కంటెంట్ చూపించడం లేదా మీరు మాతో షేర్ చేసుకున్న మీ సమాచారం ఆధారంగా మీరు ఆనందించవచ్చునని మేము భావించేది. అలా చేయడానికై, మీ Snapchat అనుభవానికి సందర్భాన్ని జోడించడానికి గాను సేవల యొక్క వివిధ రంగాల వ్యాప్తంగా మీ గురించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మేము కంటెంట్, మీ లొకేషన్, లేదా రోజు యొక్క సమయం ఆధారంగా లేబుల్స్ తో స్వయంచాలకంగా కంటెంట్ ని ట్యాగ్ చేస్తాము. కాబట్టి ఒకవేళ ఫోటో లో ఒక శునకం ఉంటే, దానిని "శునకం," అనే పదం ద్వారా మెమోరీస్ లో శోధించవచ్చు, మీరు మెమోరీని సృష్టించిన లొకేషన్ వద్ద మ్యాప్ పై చూపించవచ్చు, మరియు మీరు శునకాల కోసం వెతుకుతున్నారని మాకు తెలియజేయవచ్చు, తద్వారా మేము స్పాట్‌లైట్ వంటి మా సేవల యొక్క ఇతర భాగాలలో మీకు సరదాగా శునకాల వీడియోలు మరియు శునకాల ఆహారం యాడ్స్ ని ఉపరితలంపై చూపించగలము.
వ్యక్తిగతీకరణ కూడా, ఫ్రెండ్స్ ని సూచించడం లేదా మీరు ఎక్కువగా ఎవరితో Snap చేస్తారో దాని ఆధారంగా Snap పంపించడానికి ఒక కొత్త ఫ్రెండ్ ని సిఫార్సు చేయడానికి సహాయపడగలుగుతుంది. మేము Snap మ్యాప్ పై సిఫార్సు చేయబడిన స్థలాలను చూపించవచ్చు, స్టికర్లు ఉత్పన్నం చేయవచ్చు, లేదా ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి AI ఉపయోగించి Snaps మరియు ఇతర కంటెంట్ ను కూడా ఉత్పన్నం చేయవచ్చు, మీ కంటెంట్ లేదా యాక్టివిటీ ఆధారంగా మీ ప్రయోజనాలను చేరవేయవచ్చు, లేదా యాడ్స్ తో మేము మీకు చూపించే కంటెంట్ ను అనుకూలీకరించవచ్చు. ఉదాహరణకు, మీరు స్పాట్‌లైట్ పై బరిస్టా కంటెంట్ చూస్తే, మీ అభిమాన ఎస్ప్రెస్సో మెషిన్ గురించి My AI తో మాట్లాడితే, లేదా మీ మెమొరీస్ లో కాఫీ సంబంధిత Snaps చాలా వాటిని సేవ్ చేస్తే, మీరు ఒక కొత్త నగరాన్ని సందర్శించినప్పుడు లేదా మీకు ఆసక్తికరమైన లేదా సముచితమైన కాఫీ గురించి మీకు కంటెంట్ చూపించినప్పుడు మేము Snap మ్యాప్ పైన కాఫీ షాపులను హైలైట్ చేయవచ్చు. లేదా, మీరు అనేక మ్యూజిక్ వేదికలతో ఇంటరాక్ట్ అయితే, మేము పట్టణంలో రాబోతున్న ప్రదర్శనల కొరకు మీకు యాడ్స్ చూపించడానికి మేము దానిని ఉపయోగించవచ్చు. మీ ఫ్రెండ్స్ ఏమి చేస్తున్నారో దాని ఆధారంగా మీ అనుభవాన్ని రూపొందించడం, మీ ఫ్రెండ్స్ సృష్టించే కంటెంటును మీకు చూపించడం లేదా స్పాట్‌లైట్ పై ఆనందించడం లేదా మీ ఫ్రెండ్స్ తో ప్రాచుర్యం పొందిన సిఫార్సులను చూపించడం సహా మీ అనుభవాన్ని రూపొందించడం కూడా వ్యక్తిగతీకరణలో చేరి ఉంటుంది.
మీకు నిరంతరంగా మరింత సముచితమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం మా లక్ష్యం.
ఉదాహరణకు, ఒకవేళ మీరు ఎంతో ఎక్కువ స్పోర్ట్స్ కంటెంట్ ను వీక్షిస్తూ, ఐతే జుట్టు మరియు మేకప్ చిట్కాలతో కూడిన కంటెంట్ ని వదిలేసినట్లయితే, మా సిఫార్సు అల్గోరిథంలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాయి, కానీ ఆ మేకప్ చిట్కాలకు కాదు. మేము Snapచాటర్ల ప్రాధాన్యతలను ఎలా అర్థం చేసుకుంటామో మరియు కంటెంట్ ని ఎలా ర్యాంక్ చేసి ఆధునీకరిస్తామో దాని గురించి మీరు ఇక్కడమరింత తెలుసుకోవచ్చు.
మా Snapచాటర్ల గోప్యత యొక్క ఆకాంక్షలతో వ్యక్తిగతీకరణ యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయడం కూడా కీలకమని మేము నమ్ముతాము. ఉదాహరణకు, మెమొరీస్ లోపల ఉన్న కంటెంట్ ఆధారంగా దానికి మీరు సేవ్ చేసిన Snaps ని మేము స్వయంచాలకంగా ట్యాగ్ చేయవచ్చు (ఉదా.,ఒక డాగ్ కలిగియున్న Snap) మరి ఆ తర్వాత మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, సిఫార్సులను చేయడానికి, లేదా మీకు యాడ్స్ (డాగ్స్ కలిగియున్న స్పాట్‌లైట్ Snaps మీకు చూపించడం వంటిది) చూపించడానికి ఆ ట్యాగ్ ను ఉపయోగించవచ్చు. మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, సిఫార్సులను చేయడానికి, లేదా మీకు యాడ్స్ చూపించడానికి మీరు పంపించిన ప్రైవేట్ కంటెంట్ మరియు కమ్యూనికేషన్లను మేము ఉపయోగించము.
సంబంధిత యాడ్స్ ఇవ్వడం
మేము వ్యక్తిగతీకృతమైన సేవ అందించే మరొక మార్గం, మేము చూపించే యాడ్స్ ద్వారా ఉంటుంది. యాడ్స్ ను వ్యక్తిగతీకరించడానికి, లక్ష్యంగా చేసుకోవడానికి మరియు కొలిచేందుకు మేము సేకరించిన సమాచారం నుండి మీ ఆసక్తులు మరియు ప్రాధాన్యతలను మేము ఉపయోగిస్తాము. యాడ్స్ సంబంధితంగా ఉన్నప్పుడు అవి ఉత్తమమైనవని మేము భావిస్తాముు. అందుకనే మేము సరియైన యాడ్స్ ను ఎంపిక చేయడానికి మరియు సరైన సమయంలో మీకు వాటిని చూపించడానికి ప్రయత్నిస్తాము. ఉదాహరణకు, మీరు వీడియో గేమ్స్ కోసం యాడ్స్ తో సంప్రదించినట్లయితే, మీరు వీడియో గేమ్స్ ఇష్టపడతారని మేము భావిస్తాము, మరియు మీకు అటువంటి యాడ్స్ చూపిస్తాము, కానీ మీరు కేవలం ఈ యాడ్స్ మాత్రమే కాకుండా వేరేవి కూడా చూస్తారు. మా కంటెంట్ వ్యూహముతో పోలిన విధంగా, మీరు వివిధరకాల యాడ్స్ అందుకునేలా చూసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. మీకు బహుశా ఆసక్తి ఉండని యాడ్స్ చూపించకుండా ఉండటానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు ఇంతకు ముందు ఒక సినిమా కోసం టిక్కెట్లు కొన్నట్లుగా ఒక టికెటింగ్ సైట్ మాకు చెబితే - మేము మీకు దాని కోసం యాడ్స్ చూపించడం ఆపివేయవచ్చు. మీరు ఏ యాడ్స్ అందుకుంటారో దాని గురించి మరియు అడ్వర్టైజింగ్ యొక్క వివిధ రకాలు మరియు మీ ఎంపికల గురించి మీరు ఇక్కడతెలుసుకోవచ్చు.
అడ్వర్టైజింగ్ ప్రయోజనాల కోసం మేము మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము, మరియు షేర్ చేస్తామో అనేదాని గురించి మీరు ఇక్కడమరింత తెలుసుకోవచ్చు.
కుకీస్ మరియు ఇతర టెక్నాలజీల ద్వారా సేకరించిన సమాచారంగురించి ఒక గమనిక: మా భాగస్వాములలో ఒకరి ద్వారా మేము అందించే సేవలతో మీరు సంభాషించినప్పుడు సమాచారాన్ని సేకరించడానికి మేము ఈ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీకు మరింత సముచితమైన ప్రకటనలను చూపించడానికి ఒక అడ్వర్టైజర్ యొక్క వెబ్ సైట్ పై సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. అత్యధిక వెబ్ బ్రౌజర్లు డిఫాల్ట్ గా కుకీలను స్వీకరించేలా అమర్చబడి ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాధాన్యత ఇస్తే, మీరు మీ బ్రౌజర్ లేదా ఉపకరణంపై సెట్టింగ్స్ ద్వారా మామూలుగా బ్రౌజర్ కుకీలను తొలగించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయినా, కుకీస్ తొలగించడం లేదా తిరస్కరించడం అనేది మా సేవల లభ్యత మరియు ఫంక్షనాలిటీపై ప్రభావం చూపవచ్చునని మనసులో ఉంచుకోండి. మా సేవలు మరియు మీ ఎంపికలపై మేము మరియు మా భాగస్వాములు కుకీస్ ను ఎలా ఉపయోగిస్తామో అనేదాని గురించి మరింత తెలుసుకొనేందుకు మా కుకీ విధానమును చూడండి.
ఫీచర్లు, అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అభివృద్ధి మరియు మెరుగుపరచడం
మా సేవలను మెరుగుపరచడానికి అనువైన ఫీచర్లు మరియు మార్గాల కోసం మా బృందాలు కొత్త ఆలోచనలతో నిరంతరం ముందుకు వస్తున్నాయి. దీనిని చేయడానికి గాను, జెనరేటివ్ AI ఫీచర్లు (జెనరేటివ్ మోడల్స్ ఉపయోగించి వచనం, చిత్రాలు, లేదా ఇతర మీడియాను ఉత్పన్నం చేయగల కృత్రిమ మేధస్సు) ద్వారా సహా మా ఫీచర్లు మరియు సేవలు పని చేసేలా చేసే అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ (నమూనాలను కనుగొనడానికి లేదా ఊహాత్మక అంచనాలు చేయడానికి గణనీయమైన మొత్తంలో డేటా ద్వారా సమ్మిళితం అయ్యే అల్గోరిథం యొక్క వ్యక్తీకరణ) ని కూడా మేము అభివృద్ధి చేస్తాము. జెనరేటివ్ AI నమూనాలు వాటి ఇన్పుట్ శిక్షణ డేటా యొక్క నమూనాలు మరియు నిర్మాణమును నేర్చుకుంటాయి మరి ఆ తర్వాత అలాంటి లక్షణాలు ఉన్న కొత్త డేటాను ఉత్పన్నం చేస్తాయి). మేము వ్యక్తిగతీకరణ, అడ్వర్టైజింగ్, భద్రత మరియు రక్షణ, సమంజసత మరియు చేకూర్పుదనం, ఆగ్మెంటేడ్ రియాలిటీ కోసం మరియు దురుపయోగం లేదా సేవా నిబంధనలు ఉల్లంఘనలను నివారించడానికి అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, My AI నుండి ప్రతిస్పందనలను మెరుగుపరచడానికి Snapచాటర్లు My AI తో జరిపిన సంభాషణలను మా అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ లెక్కలోనికి తీసుకుంటాయి.
మేము ఏ రకమైన మెరుగుదలలను తయారు చేయాలి అని నిర్ణయించడానికి మీ సమాచారం మాకు సహాయపడుతుంది, అయితే మేము ఎల్లప్పుడూ గోప్యత పై దృష్టి సారిస్తాము - మరియు మా ఫీచర్లు మరియు మోడల్స్ అభివృద్ధి చేయడానికి అవసరమైన దానికన్నా ఎక్కువగా వ్యక్తిగత సమాచారమును ఉపయోగించకూడదని మేము కోరుకుంటాము.
విశ్లేషణలు
ఏది నిర్మించాలి లేదా మా సేవలను ఎలా అభివృద్ధి చేయాలి అని అర్థం చేసుకోవడానికి గాను, మేము మా ఫీచర్ల కోసం పోకడలు మరియు డిమాండ్‌ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, మేము ఒక గ్రూప్ యొక్క గరిష్ట పరిమాణం వంటి ఫీచర్ యొక్క భాగాలను మార్చాలో లేదో నిర్ణయించడానికి సహాయపడేందుకు మేము గ్రూప్ చాట్ వాడకం గురించి మెటాడేటా మరియు పోకడలను పర్యవేక్షిస్తాము. Snapచాటర్ల నుండి డేటా అధ్యయనం చేయడం వల్ల ప్రజలు సేవలను ఉపయోగించే మార్గాలలో పోకడలను చూడడానికి మాకు సహాయపడగలుగుతుంది. ఇది భారీ స్థాయిలో Snapchat ని మెరుగుపరచడానికి మాకు స్ఫూర్తిని అందిస్తుంది. పోకడలు మరియు వాడకమును గుర్తించడానికి, పర్యవేక్షించడానికి మరియు విశ్లేషించడానికి గాను మేము విశ్లేషణలను నిర్వహిస్తాము. ఈ సమాచారం ఆధారంగా, మేము ఇతర విషయాలతో పాటుగా, డిమాండ్ ను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడటానికై మా వినియోగదారుల గురించి సమాచారాన్ని రూపొందిస్తాము.
పరిశోధన
సాధారణ వినియోగదారు ఆసక్తులు, పోకడలు, మరియు మీచే మరియు మా కమ్యూనిటీలోని ఇతరులచే మా సేవలు ఎలా ఉపయోగించబడుతున్నాయో మరింత బాగా అర్థం చేసుకోవడానికి మేము పరిశోధన నిర్వహిస్తాము. ఈ సమాచారం, విశ్లేషణలతో పాటుగా (మేము పైన వివరించినట్లుగా), మా కమ్యూనిటీ గురించి మరియు మా సేవలు మా కమ్యూనిటీలో ఉన్నవారి జీవితాలకు ఎలా సరిపోతున్నాయో మేము మరింతగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది. మేము కొత్త పద్ధతులు మరియు టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి కూడా పరిశోధన మరియు అభివృద్ధిలో నిమగ్నమవుతాము (ఉదా, కొత్త మెషీన్ లెర్నింగ్ మోడ్యూల్స్ లేదా హార్డ్‌వేర్, Spectacles వంటివి). మా పరిశోధన యొక్క ఫలితాలు కొన్నిసార్లు Snapchat పై ఫీచర్లలో ఉపయోగించబడతాయి, మరియు మేము కొన్నిసార్లు సమగ్రమైన ప్రవర్తనలు మరియు వినియోగదారు పోకడలు వంటి విషయాల గురించి పత్రాలను ప్రచురిస్తాము (అవి వినియోగదారు బేస్ అంతటా క్రోడీకరించబడిన డేటా మాత్రమే కలిగి ఉంటాయి, మరియు మీ గురించి ప్రత్యేకంగా ఎటువంటి ప్రైవేటు సమాచారాన్ని కలిగి ఉండవు).
మా సేవల భద్రత మరియు భద్రతను పెంపొందించుట
మా సేవల భద్రత మరియు రక్షణను పెంపొందించడానికి, Snapచాటర్ల గుర్తింపును వెరిఫై చేయడానికి, మరియు మోసం లేదా ఇతర అనధికార లేదా చట్టవిరుద్ధమైన చర్యను నివారించడానికి మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ అకౌంట్‌ను సంరక్షించుటలో సహాయపడేందుకు మేము రెండు-అంచెల ప్రామాణీకరణ విధానాన్ని అందిస్తాము మరియు మేము ఏదైనా అనుమానాస్పద చర్యను గమనిస్తే, మీకు ఇమెయిల్ లేదా వచన సందేశాలు పంపించవచ్చు. ఒక వెబ్‌పేజీ హానికరమైనదా లేదా అని తెలుసుకోవడానికి మేం Snapchatలో పంపిన URLలను స్కాన్ చేసి, దాని గురించి మిమ్మల్ని హెచ్చరించగలం.
మిమ్మల్ని సంప్రదించడం
కొత్తవి లేదా ఇప్పటికే ఉన్న ఫీచర్లను ప్రోత్సహించడానికి మేము కొన్నిసార్లు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటాము. ఇందులో, అనుమతించబడిన చోట, Snapchat, ఇమెయిల్, SMS, లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్ ద్వారా Snapచాటర్లకి కమ్యూనికేషన్‌లను పంపించడం చేరి ఉంటుంది. ఉదాహరణకు, మా సేవలు మరియు మీరు ఆసక్తి చూపిస్తారని మేము భావించే ప్రోత్సాహక ఆఫర్ల గురించి సమాచారాన్ని షేర్ చేయడానికి మేము Snapchat యాప్, ఇమెయిల్, SMS, లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ను ఉపయోగించవచ్చు.
ఇతర సమయాల్లో, సమాచారం, హెచ్చరికలు, లేదా మా వినియోగదారులు తమ అభ్యర్ధన మేరకు మమ్మల్ని పంపించమని అడిగే సందేశాలను అందించడానికి మేము మీతో కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. ఇందులో, Snapchat, ఇమెయిల్, SMS, లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కమ్యూనికేషన్‌లను పంపించడం చేరి ఉండవచ్చు, అనుమతించబడిన చోట అకౌంట్ స్థితి నవీకరణలు, భద్రతా హెచ్చరికలు, మరియు చాట్ లేదా స్నేహపూర్వక రిమైండర్లు అందజేయబడవచ్చు; ఇందులో Snapచాటర్స్ యేతర వ్యక్తులకు ఆహ్వానాలు లేదా Snapchat కంటెంట్ పంపించడానికి మా యూజర్ అభ్యర్ధన ను నెరవేర్చడం కూడా ఇమిడి ఉండవచ్చు.
మద్దతు
మీరు సహాయం కోసం అడిగినప్పుడు, మీరు వీలైనంత త్వరగా మద్దతు పొందాలని మేము కోరుకుంటాము. మా సేవలతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సహాయంతో మీకు, Snapచాటర్ కమ్యూనిటీ మరియు మా వ్యాపార భాగస్వాములకు సహాయం అందించడానికి గాను, మేము ప్రతిస్పందించడానికి మేము సేకరించిన సమాచారాన్ని తరచుగా ఉపయోగించాల్సి ఉంటుంది.
మా నిబంధనలు మరియు విధానాలను అమలు చేయడం
మేము సేకరించిన డేటా ను నిబంధనలు మరియు చట్టాన్ని అమలు చేయడానికి మేము ఉపయోగిస్తాము. ఇందులో మా నిబంధనలు, విధానాలు, లేదా చట్టాన్ని ఉల్లంఘించే ప్రవర్తనను అమలు చేయడం, పరిశోధించడం మరియు నివేదించడం, చట్టం అమలు నుండి అభ్యర్థనలకు ప్రతిస్పందించడం, మరియు చట్టపరమైన అవసరాలతో సమ్మతి వహించడం చేరి ఉంటాయి. ఉదాహరణకు, మా సేవలపై చట్టవిరుద్ధమైన కంటెంట్ పోస్ట్ చేయబడినప్పుడు, మేము మా నిబంధనలు మరియు ఇతర విధానాలను అమలు చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, చట్ట అమలు అభ్యర్థనలతో సహకరించడానికి, చట్ట అమలు అధికారులు, పరిశ్రమ భాగస్వాములు, లేదా ఇతరులకు భద్రతా సమస్యలను తెలియజేయడానికి, లేదా మా చట్టపరమైన బాధ్యతలు తో సమ్మతి వహించడానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగించవచ్చు లేదా షేర్ చేయవచ్చు. మరింత తెలుసుకోడానికి మా పారదర్శకత నివేదిక ను చూడండి.